ఓ.. అగ్రరాజ్యమా...!
శతాబ్దాలు మారినా...
నీ తీరు మారలేదు...
నీ ధనకాంక్ష తీరలేదు ..!
ఆఫ్ఘనిస్తాన్లో దోపిడీ చేసిన
కోట్లాది డాలర్ల సొమ్ము ...
నీ ఇష్టం వచ్చినట్టు పంచుతావా...?
పంచటానికి నీ నైతిక అర్హత ఏమిటి ..?
ఆ... పనికి ఐక్యరాజ్య సమితి లేదా...?
అంతర్జాతీయ సంస్థలు లేవా..!
ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మననీ...
ప్రపంచ శాంతి కపోతాన్ననీ..
డబ్బా కొట్టుకునే నీ అసలు నైజం...
మరోసారి తేట 'తెల్ల' మయ్యింది..!
అంతే ...!
ఆఫ్ఘన్ ప్రజలకి పంచబోయే సంస్థ..
నీ చేతిలో కీలుబొమ్మ కాదని..
గ్యారంటీ ఏమిటి...?
ప్రపంచమా... నిరసించు...
ఈ కొత్త తరహా సామ్రాజ్యవాదాన్ని..!
వినిపించు... కోటి గొంతులై...
ప్రపంచ ప్రజాస్వామ్య నినాదాన్ని..!!
- బొల్లాప్రగడ వెంకట పద్మరాజు
98498 99676