ప్రపంచం చూపు భారత్ వైపు..
సెమినార్‌లో శాస్త్రవేత్తలు, వక్తల ఉద్ఘాటన
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి , ఏర్పేడు: అంతరిక్షంలో భారత్ కొనసాగిస్తున్న జైత్ర యాత్రలపై ప్రపంచమే మన వైపు చూస్తోందని పలువురు శాస్త్ర వేత్తలు, వక్తలు అన్నారు. స్థానిక తిరుపతి ఐఐటీలో 'ఆకాష్-అనంత మైన అవకాశాలు' పేరుతో శనివారం ఒకరోజు సెమినార్ సిరీస్‌ను నిర్వ హించారు. భార తదేశ అంతరిక్ష అన్వేషణ కార్య క్రమాల ఇటీవలి పురోగతిపై ఇస్రో, ఇతర సంబంధిత సంస్థల నుండి వచ్చిన శాస్త్రవేత్తలు, వక్తలు విద్యార్థులకు విశదీకరించారు. చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-3 లక్ష్యాలు, రూపకల్పన, సవాళ్ల గురించి వివరించారు. చంద్రయాన్-3 డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ జివిపి భరత్ కుమార్ ల్యాండర్, రోవర్‌లు చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎలా దిగాయో, ఎలాంటి పరిశోధనలు జరిపాయో తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శ్రీనాథ్ రత్నకుమార్, కె శంకర సుబ్రమణియన్ పాల్గొన్నారు.










