ప్రజాశక్తి - ఏలూరు
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించి ప్రపంచానికే గాంధీ ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గాంధీ వర్థంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిసమగ్రత, సమైఖ్యతలను పరిరక్షించేందుకు గాంధీ అనుసరించిన శాంతియుత మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. గాంధీ జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెసి పి.అరుణ్ బాబు, ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.










