అనంతపురం కలెక్టరేట్ : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణలో అనంతపురం జిల్లా దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ - 2023 ఫలితాల్లో దేశంలోనే అనంతపురం జిల్లా సత్తాచాటి 3వ స్థానం కైవసం చేసుకుంది. ఈ మేరకు బుధవారం నాడు ఢిల్లీ, బిపిఎన్‌ఐ (బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా) నుంచి జిల్లా ఐసిడిఎస్ పీడీ బిఎన్.శ్రీదేవికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై కలెక్టర్ ఎం.గౌతమి నిరంతర పర్యవేక్షణ చేయడంతో అత్యుత్తమ స్థాయిలో వారోత్సవాలను ఐసిడిఎస్ అధికారులు నిర్వహించారు. తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై దేశంలోని 14 రాష్ట్రాల నుంచి బిపిఎన్‌ఐకు మొత్తం 77 నివేదికలు అందాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 6 రకాల ఎంట్రీలు వెళ్లాయి. ఇందులో అనంతపురం జిల్లా నుంచి 2,302 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పూర్తిస్థాయిలో నిర్వహించడం జరిగిందని ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి నివేదిక పంపించారు. ఇందులో ఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ (యుసిఎంఎస్, జిటిబి హాస్పిటల్) దేశంలో 1వ స్థానంలో నిలవగా, మహారాష్ట్రకు చెందిన నిరమయ హెల్త్ ఫౌండేషన్ 2వ స్థానంలో నిలిచింది. ఇక అనంతపురం మహిళా అభివద్ధి, సంక్షేమ శాఖ దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ ఘనతపై కలెక్టర్ ఎం.గౌతమి హర్షం వ్యక్తం చేశారు. తల్లిపాల వారోత్సవాల నిర్వహణలో దేశంలోనే అనంత జిల్లా 3వ స్థానంలో నిలవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. జిల్లాకు పేరు రావడానికి కష్టపడి పనిచేసిన ఐసిడిఎస్ పీడీ, అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఐసిడిఎస్ పీడీ బిఎన్.శ్రీదేవి మాట్లాడుతూ కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో జిల్లాలో సమర్థవంతంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించామన్నారు. జిల్లాలో అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలపై వివిధ కార్యక్రమాలను నిర్వహించామన్నారు. అందులో ఉమ్మడి గహ సందర్శనలు, హాస్పిటల్, కార్యాలయ సందర్శనలు, అవగాహన సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పోటీలు, అభినందనలు, సమస్యల గుర్తింపు లాంటి కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. ఈ కార్యక్రమాలకు గుర్తింపుగా అనంతపురం జిల్లా దేశంలో మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆమె కతజ్ఞతలు తెలియజేశారు.










