ప్రపంచ శాంతికి ముందడుగుపాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన అఖిల పక్ష సంఘాలు

రాయచోటి టౌన్ : ఐక్య రాజ్య సమితి షరతులు ఉల్లంఘించి పాలస్తీనా పై ఇజ్రాయిల్ భీకర యుద్ధం చేయడాన్ని రాయచోటి ముస్లిం మైనార్టీలు, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, మహిళా సంఘాలు రాజకీయపార్టీ కలిసి పట్టణంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించాయి. ఠాణా దగ్గర నుంచి బంగ్లా వరకు జాతీయ జెండాలు చేత బట్టి ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. మైనార్టీ యువ నాయకులు యస్ .సగీర్ షాహుల్ హమీద్ అధ్యక్షతన వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి. ఓబులు మాట్లాడుతూ యుద్ధంపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం సరైంది కాదన్నారు. మెడికల్ కిట్లు పంపించాలని కోరారు. రాష్టంలో నే రాయచోటి మైనార్టీలు నిర్వహించిన శాంతి ర్యాలీ అభినందనీయం ఆదర్శనీయమని కొనియాడారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి నరసింహులు మాటా ్లడుతూ చిన్న పిల్లలపై దాడి చేయడం శోచనీ యమన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యస్ అల్లా బకాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పాలస్తీనా పై జరుగుతున్న క్రూరమైన దాడిని కులమతాలకతీతంగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ యస్ ఫయా జ్‌బాషా మాట్లాడుతూ ప్రపంచంలో శాంతిని నెలకొల్ప డానికి ముందుకొచ్చిన అందరినీ అభినం దించారు. వైసిపి మదనపల్లి నియోజ కవర్గం పరిశీలకులు కె హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ బలహీనమైన పాలస్తీనాను అంతం చేయాలని ఇజ్రాయిల్‌కు ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా సామ్రాజ్యవాద అవకాశాల వాద రాజకీయ విధానం ఎండగడుతూ భవిష్యత్లో ఇజ్రాయిల్‌కు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. టిడిపి ప్రధాన కార్యదర్శి యస్ గాజుల ఖాధర్ బాష మాట్లాడుతూ పాలస్తీనా పసిబిడ్డ లమీద ఆసు పత్రుల మీద దాడి చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీని వాసులు, నాయకులు ఎ. రామాంజులు, కె నాగబసిరెడ్డి, యస్. ఫయాజ్ జి మాధవయ్య బి రెడ్డెయ్య సాంబశివ రంగారెడ్డి సరోజ, మైనారిటీ నాయకులు మౌలానా వింగ్ ఇందాదుల్లా ఖాస్మి, టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాదర్ వలి, ఎన్‌ఆర్‌సి కన్వినర్ రిజ్వాన్, కార్మిక సంఘాలు, మైనార్టీ నాయ కులు యువత పాల్గొన్నారు.