Sep 26,2023 22:14

ర్యాలీలో పాల్గొన్న అధికారులు, నాయకులు

లేపాక్షి : ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా మండలం కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక నంది విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌ వస్తువులను వాడకూడదని కోరారు. పర్యాటక కేంద్రంగా దేశంలోనే లేపాక్షికి ఉత్తమ అవార్డును ప్రకటించారన్నారు. ఢిల్లీ లో ఉత్తమ పర్యాటక గ్రామం అవార్డు తీసుకోవడానికి పంచాయతీ ప్రెసిడెంట్‌ ఆదినారాయణ పర్యాటక సిబ్బంది డిల్లీకి వెళ్లారన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ బాబు, ఎంపీడీవో నరసింహ నాయుడు, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగేశ్వర్‌ రెడ్డి, లక్ష్మణ్‌, వైసిపి నాయకులు నారాయణ స్వామి, ఈవోఆర్డీ శివన్న, వైస్‌ ఎంపీపీ అంజనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.