Dec 12,2022 00:24

ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల పర్వత యాత్ర

ప్రజాశక్తి -తగరపువలస : స్థానిక సంగివలస అనిల్‌ నీరు కొండ దంత వైద్య కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యాన ఆదివారం ప్రపంచ పర్వత దినోత్సవం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మడగడ పర్వత ప్రాంతంలో 40 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు డిసెంబర్‌ 10, 11 తేదీల్లో సాహస యాత్ర చేశారు. పర్వతాల ఆవశ్యకత, ఆదివాసీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించేందుకు ఏటా డిసెంబర్‌ 11న ప్రపంచ పర్వత దినోత్సవం జరుపుకోవాలని ఐక్య రాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో ఈ యాత్ర చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎల్‌ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ పి.శివకుమార్‌, అధ్యాపకులు డాక్టర్‌ ప్రకాష్‌, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ మూర్తి, డాక్టర్‌ అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.