ఫొటో : మానవహారం నిర్వహిస్తున్న ఆరోగ్యకేంద్రం సిబ్బంది
ప్రపంచ దోమల నివారణ దినోత్సవం
ప్రజాశక్తి-సీతారామపురం : ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా సోమవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది దోమల నియంత్రణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ర్యాలీని చేపట్టి మానవహారం నిర్వహించారు. సర్ రోనాల్డ్ రాస్ అనే బ్రిటీష్ శాస్రవేత్త 1897వ సంవత్సరం ఆగస్టు 20న మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందునని కనుగొన్నారని తెలిపారు. ఆయనను స్మరించుకుంటూ దోమ పుట్టకూడదు.. దోమ కుట్టకూడదు.., ఫ్రై డే డ్రై డే అనే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ ఎం.రవికుమార్, ఎ.స్వప్న, సిహెచ్‌ఒ మంజుల, ఎంపిహెచ్‌ఇఒ అబ్దుల్ మజీద్, సబ్ యూనిట్ అధికారి నౌషద్, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










