ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలోని వెచ్చంగి గ్రామంలో కీర్తిశేషులు, ప్రొపెసర్ డాక్టర్ లసాంగి రాధాకృష్ణకు ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, అనంతగిరి జడ్పీటీసీ దీసరి గంగరాజులు ఘనంగా నివాళి అర్పించారు. గ్రామంలో రాధాకృష్ణ పెద్ద కర్మ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జడ్పీటీసీ గంగరాజు మాట్లాడుతూ, ముంచంగిపుట్టు మండలంలోని వెచ్చంగి గ్రామంలో జన్మించిన రాధాకృష్ణ ఎన్నో కష్టాలు పడి అత్యున్నతమైన యూనివర్సిటీలో ప్రొపెసర్‌గా నియమితులవ్వడం గర్వ కారణమన్నారు. కృషి, పట్టుదలతో చదివి అంచెలంచెలుగా ఉన్నత విద్యావంతులుగా ఎదిగారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్, సీపీఎం మండల కార్యదర్శి భీమరాజు, కిల్లో రామారావు, రాందాస్, శివ పాల్గొన్నారు.










