ప్రోలింగ్ స్టేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి : హరిత
నివేదిక సిద్ధం చేయాలి
పజాశక్తి - తిరుపతి టౌన్
తిరుపతి నగరంలోని పోలింగ్ స్టేషన్లు అన్నీ సక్రమంగా వున్నాయా లేవా అని పరిశీలించి నివేదిక తయారు చేయాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులతో, మునిసిపల్ రెవెన్యూ అధికారులు, ఆర్‌ఐలతో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి నగరంలో 265 పోలింగ్ బూత్‌లు 109 ప్రదేశాల్లో వున్న విషయాన్ని ప్రస్థావిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ బూత్‌ను టీమ్ గా ఏర్పరిచిన అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని, తానే స్వయంగా ప్రతి ఒక్క పోలీంగ్ బూతును గురువారం నుండి పరిశీలిస్తానన్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ లిస్టులో వున్న పోలీంగ్ బూతులు నిర్వహించే భవనాలు పటిష్టంగా వున్నాయా లేవా అని పరిశీలించాలని, ఆయా పోలింగ్ బూతుల పేర్లు ఏమైనా మారి వున్నాయా అని నిర్ధారించుకోవాలని, ఒకవేళ మారి వుంటె వాటి వివరాలను జిల్లా ఎన్నికల అధికారి దష్టికి వెంటనే తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా ఆయా పోలీంగ్ బూతులు ప్రభుత్వ భవనాల్లో వున్నాయా, ఏవైనా ప్రైవేట్ భవనాల్లో వున్నాయా అనే వివరాలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సంఖ్య 1400 దాటిన పోలింగ్ బూత్ లను గుర్తించి, దగ్గర్లోని వేరే పోలీంగ్ బూత్ కి మార్చేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అదనపు అధికారులు డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, మునిసిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, డిటీ జీవన్, ఆర్.ఐలు పాల్గొన్నారు.
ఎన్నికల అధికారులతో కమిషనర్ హరిత సమీక్ష










