Oct 02,2023 21:37

విలేకరులతో మాట్లాడుతున్న నాగమణి

ప్రొద్దుటూరు ;| ప్రొద్దుటూరులో సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహించింది. 2020లో జరిగిన ఓ కేసుకు సంబ ంధించి విచారణ నిమిత్తం పట్టణంలోని ఓ విలేకరి (ప్రజాశక్తి కాదు) ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇంట్లో ఉన్న విప్లవ సాహిత్యానికి సంబంధించిన నాలుగు పుస్తకాలు, రూ.12.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరి భార్య నాగమణిని విచారించారు.
సమాజ సంక్షేమం గురించి మాట్లాడడం నేరమా
సమాజం బాగు గురించి ఆలోచించి సమాజ సంక్షేమం గురించి మాట్లాడడం నేరమా అని సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) విచారణకు గురైన నాగమణి ప్రశ్నించారు. ఎన్‌ఐఎ తన గృహంలో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో స్తానిక ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు 2020లోని ఓ కేసుకు సంబంధించి ఎన్‌ఐఎ పోలీసులు తెల్లవారుజామున ఇంటి సభ్యులను భయబ్రాంతులక గురిచేస్తూ సర్చ్‌వారంట్‌తో తన ఇంట్లో సోదాలు నిర్వహించారన్నారు. ఇంటిలోని వృద్ధులను, పసిపిల్లలను భయానికి గురిచేశారన్నారు. కులనిర్మూలన, విరసం సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతో పాటు ఇంట్లో ఉన్న రూ.12.50 లక్షల నగదును తీసుకెళ్లారన్నారు. తన అత్తకు వారి పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన స్థలాన్ని అమ్మగా వచ్చిన నగదును తీసుకెళ్లారన్నారు. అనారోగ్యంతో ఉన్న అత్తమామ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం, కుటుంబ అవసరాల నిమిత్తం దాచి ఉంచిన నగదును తీసుకెళ్లారన్నారు. తాను స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న విషయం వారికి తెలిపినా తన ఫోన్‌ను తీసుకెళ్లారన్నారు. తాము చట్టబద్దంగా జీవిస్తున్నప్పటికీ చట్టవిరుద్దంగా వ్యవహరించి ఇంటిలోని నగదును తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టార్జితాన్ని కోర్టుకొచ్చి తీసుకోండి అని చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. నంబర్‌ప్టేట్‌లేని వాహనాల్లో వారొచ్చినట్లు తెలిపారు. ఇంటి ఖర్చుల నిమిత్తం డబ్బులు దాచిపెట్టుకోవడం నేరమా అని ప్రశ్నించారు. విరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరలకిë మాట్లాడుతూ 2018లోని ఓ కుట్ర కసులో 16 మందిని ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంచారన్నారు. చట్టవ్యతిరేకకార్యకలాపాల నిరోధకచట్టం తీసుకొచ్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కేవలం ఆరోపణల మీదనే జైల్లో ఉంచుతున్నారన్నారు. సమాజంలో శ్మశాననిశ్శబ్దాన్ని తీసుకొచ్చేందుకు ఇలాంటి పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రజాస్వామ్మరాజ్యంలో ఇలాంటివి చెల్లవన్నారు.