Aug 05,2023 21:17

ప్రజాశక్తి - భీమవరం
జిల్లాలో 72,059 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా కాగా 25,383 నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో హౌసింగ్‌, రెవెన్యూ, పిఆర్‌అండ్‌ఆర్‌డి, స్వమిత్వ, జాతీయ చేనేత దినోత్సవం, వ్యవసాయం, పశుసంరక్షణ, డెయిరీ డెవలప్‌మెంట్‌, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, అంశాలపై సమీక్షిం చారు. కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌.ప్రశాంతి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌ సుందర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాంకు సంబంధించి ఈ ఏడాది మే 9వ తేదీ నుంచి అందిన 6,346 అర్జీల్లో 4,844 పరిష్కరించామని తెలిపారు. వాటిలో 1,041 పరిష్కార దశలో ఉన్నాయని, 437 రీఓపెన్‌ అయ్యాయని తెలిపారు. ఆడుదాం ఆంధ్రా కింద గ్రామ, వార్డు, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలో 4 దశల్లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికను అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకూ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సచివాలయ భవనాలు, ఆర్‌బికెలు, హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని, నిర్మాణా లు పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులచే ప్రారంభిస్తామని తెలిపారు.