Sep 12,2023 20:43

రికార్డులు పరిశీలిస్తున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పూర్ణిమ

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :సమగ్ర భూసర్వే కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా ప్రభుత్వం వేగవంతం చేసిందని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పూర్ణిమ తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక తహశీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూర్ణిమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టత్మాకంగా భావిస్తోందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లను నియమించిందని పూర్ణిమ చెప్పారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఒలకు జగనన్న శాశ్వత భూ హక్కు, భూసర్వే కార్యక్రమంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సమగ్ర భూ సర్వే నిర్వహణ ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు స్పెషల్‌ కలెక్టర్‌ పూర్ణిమ పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల తహశీల్దార్‌ లావణ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.