Oct 27,2022 23:25

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న డిఇఒ చంద్రకళ

ప్రజాశక్తి -భీమునిపట్నం : ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధించాలని డిఇఒ ఎల్‌.చంద్రకళ సూచించారు. స్థానిక ఎంఇఒ కార్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా తరగతులను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ, చదువులో వెనుక బడిన విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం చెరో గంట సమూహాలుగా విభజించి బోధించాలన్నారు. చిత్రాలు, చార్టులు, మైండ్‌ మ్యాపింగ్‌పై చర్చించారు. ఎంఇఒ కెఎ బాలామణి, రిసోర్స్‌ పర్సన్లు సర్వాజోస్యుల గౌరీ శంకర శాస్త్రి, జి.పరదేశి, వి.సత్యం పాల్గొన్నారు.