Sep 02,2023 23:57

ప్రజాశక్తి - రేపల్లె
పట్టణంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు(84) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. గత 50సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ సేవా దృక్ఫదంతో పని చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. సేవకు మారుపేరుగా నిలిచిన డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు మృతి చెందడం బాధాకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి రమాదేవి అన్నారు. వేజళ్ళ ప్రకాశరావు మంచి హస్తవాసి గల డాక్టర్‌ అని, అతి స్వల్ప ఫీజు, అతి తక్కువ మందులు, సరైన రోగ నిర్ధారణ ఆయన ప్రత్యేకతని తెలిపారు. నాణ్యమై వైద్య సేవలు అందించి మంచి డాక్టర్‌గా పేరు పొందారని అన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్,  బిఎల్‌కె ప్రసాద్, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డాక్టర్ వేజళ్ళ ప్రకాశరావు మృత దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.