ప్రజాశక్తి-చోడవరం
వాహనదారులు భద్రతా ప్రమాణాలను పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉంటారని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఆర్టిఐ అధికారులు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ వాహనాలు సంఖ్య పెరిగిపోవడంతో, రోడ్లు విస్తరణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్లపై వాహనాన్ని స్పీడ్‌గా నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి వర్మ రాజు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, ఎంపీడీవో ఎస్డి శ్యామ్ సుందర్, ఎంపీపీ గాడి కాసు, వైస్ ఎంపీపీ బైన ఈశ్వరరావు పాల్గొన్నారు.
సబ్బవరం : రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక సీతారామ కల్యాణ మండపంలో ఆటో డ్రైవర్లకు శనివారం రోడ్డు భద్రతపై స్థానిక సిఐ పి.రంగనాథం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఎల్. సురేష్ పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పి భీమవరం, బుచ్చయ్యపేట, ఆర్.శివరాంపురం తదితర గ్రామాల్లో రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా డ్వాక్రా సంఘాల సభ్యులు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం బాలరాజు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.










