Aug 06,2023 21:04

- రిమ్స్‌ డెంటల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.జ్యోత్న్స వెల్లడి

కడపప్రతినిధి ; విద్య, వైద్య ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. బోధనతోపాటు ఎల్‌ఇడి ప్రొజెక్టర్ల ద్వారా బోధన, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో స్టడీఅవర్స్‌ నిర్వహణ, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ఈఏడాది నుంచి మరో నాలుగు పీజీ కొత్త కోర్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టాం. ఇదేతరహాలో ఓపి, ఐపి వైద్యసేవల మెరుగుదలపై దృష్టి సారించాం. ఎత్తుడు, వంకర, రూట్‌కెనాల్‌, ఇంప్లాంట్‌ వంటి సమస్యలకు ఆధునిక చికిత్సలు చేస్తున్నాం. డెంటల్‌ కళాశాలకు చెందిన సుమారు 150 మంది బిడిఎస్‌ విద్యార్థులతోపాటు 23 మంది పీజీ విద్యార్థులు అందుబాటులోకి రావడంతో మెరుగైన సేవలు అందించ గలుగుతు న్నామని పేర్కొంటున్న డెంటల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డా.ఎం.జ్యోత్న్సతో ప్రజాశక్తి ముఖాముఖి...
డెంటల్‌ కోర్సుల వివరాలు తెలపండి?
బిడిఎస్‌, ఎండిఎస్‌ కోర్సులు అందిస్తున్నాం. ఇందు లో 100 బిడిఎస్‌, 23 ఎండిఎస్‌ కోర్సుల్లో విద్యాభ్యాసం జరుగుతోంది. ఈ ఏడాది మరో నాలుగు కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పీజీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మౌలిక వసతుల కల్పనపై మీ కామెంట్‌?
డెంటల్‌ కళాశాలలో బిడిఎస్‌, ఎండిఎస్‌ విద్యార్థులకు ప్రాథమిక సదు పాయాలు, విద్యార్థులకు మెటీరియల్‌ను సరఫరా చేయాల్సి ఉంది. హాస్టళ్లలో లైటింగ్‌ సదుపాయాల కల్పన, తరగతి గదుల్లో కుర్చీలు, ఇతర బోధనావసరాలను ఏర్పాటుపై దృష్టి సారించాలి.
సిడిఎస్‌ సమావేశాల నిర్వహణ గురించి తెలపండి?
ఏడు రోజులకు ఒకసారి (సిడిఎస్‌) సమావేశాలు నిర్వహిస్తాం. కళాశాల అభివృద్ధి నిధి (సిడిఎస్‌) సమావేశానికి డిఎంఇ అధ్యక్షతన నిర్వ హి స్తాం. ఇందులో కళాశాల సంబంధిత సమస్యలను ప్రస్తావించడం జరు గుతుంది. ఆయన ఆదేశాల మేరకు అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటాం.
ఫ్యాకల్టీ కొరతపై స్పందించండి?
తొమ్మిది ప్రొఫెసర్‌ పోస్టులకు ఎనిమిది మంది ఉన్నారు. 33 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 26 మంది ఉన్నారు. 17 సెక్షన్లకు సంబంధించి 12 మంది ఉండాల్సి ఉంది. కానీ ఐదు ట్యూ టర్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ ఏడాది నుంచి మరో నాలు గు కొత్త పీజీ కోర్సు లను ప్రారంభించే నాటికి మిగిలిన ఒక ప్రెఫెసర్‌, 15 అసోసియే యేట్‌, ఏడు అ సిస్టె ంట్‌, ఐదు ట్యూటర్‌ సహా కొత్త పీజీ కోర్సులకు తగిన రీతిలో పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
డెంటల్‌ కోర్సుల వివరాలు తెలపండి?
తొమ్మిది కోర్సులున్నాయి. ఓరల్‌ మెడి సిన్‌ అండ్‌ రేడియాలజీ, ఓరల్‌ సర్జరీ, ప్రీడెం టానియా, ప్రొస్టోటెంటానియా, కన్సర్వేటివ్‌ డెం టిస్టీ, పీడో డెంటాన్షియా, ఆర్థోడెన్షియా, కమూ ్యనిటీ అండ్‌ ప్రివెంటివ్‌ డెంటిస్ట్‌, ఓరల్‌ పాథాలజీ వంటి కోర్సులున్నాయి. వీటితోపాటు ఈ ఏడాది నుంచి ఓరల్‌ మెడిసిన్‌, ఓరల్‌సర్జరీ, పార్థో డాంటిక్స్‌, ప్రోస్తోడాంటిక్స్‌ వంటి అదనపు పీజీ కోర్సులను ప్రారంభిస్తున్నాం.
ఓపి, ఐపి చికిత్సల వివరాలు తెలపండి?
జ: ప్రతిరోజూ ఓపి కింద 140 నుంచి 180 మంది, 50 నుంచి 60 ఐపి కేసులు నమోదు చేస్తున్నాం. భవిష్యత్‌లో డెంటల్‌ ఓపి, ఐపి కేసుల మెరుగుదలకు కృషి చేస్తాం.
ఓపి మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలేమిటి?
రోజూ ఓపి రోగులకు ఇచ్చిన ప్రిస్కిప్షన్‌ ప్రకారం టెస్టింగ్‌ రాసిన రోగులకు మరుసటి రోజు రావాల్సి ఉండేది. తాజాగా అదే రోజు సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల మధ్య వచ్చి టెస్టింగ్‌ను పరిశీలించి రోగులకు ప్రిస్కిప్షన్‌ రాయడం ద్వారా చికిత్సలను వేగవంతం చేస్తున్నాం. తద్వారా ఓపి, ఐపి రోగుల నమోదు పెరిగే అవకాశం ఉంది.