ప్రజాశక్తి-రేపల్లె/బాపట్ల: బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు నియామకం హర్షణీయమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం మల్లికార్జునరావును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బస్టాండ్ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. ప్రమాణ స్వీకార మహౌత్సవానికి రేపల్లె నుంచి సుమారు 100 కార్లతో భారీ ర్యాలీతో బాపట్లకు చేరుకున్నారు. కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ పోతుల సునీత, చీరాల శాసనసభ్యులు కరణం బాలరామకృష్ణమూర్తి, చీరాల వైసీపీ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్, మునిసిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసిపి నాయకులు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










