ప్రజాశక్తి-బొబ్బిలి : గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరి పారాది వంతెన కుంగిపోతోంది. ప్రమాదపు అంచుకు చేరడంతో ముందు జాగ్రత్తగా అధికారులు ద్విచక్ర వాహనాలకు మాత్రమే వంతెన పైనుంచి రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంతెనను మంగళవారం సాయంత్రం డిఎస్‌పి పి.శ్రీధర్, పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ వంతెన కుంగిపోవడంతో ప్రమాదాలను నివారించేందుకు వంతెన పైనుంచి ద్విచక్ర వాహనాలకు మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం నుంచి బొబ్బిలి వెళ్లే వాహనాలు రామభద్రపురం నుంచి బాడంగి, ముగడ లేదా పినపెంకి మీదుగా, పార్వతీపురం వెళ్లే వాహనాలు రామభద్రపురం నుంచి రాజాం మీదుగా మల్లిస్తున్నామని చెప్పారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్లే వాహనాలను ముగడ లేదా పినపెంకి మీదుగా రామభద్రపురం, పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్లే వాహనాలను ఖడ్గవలస మీదుగా దారి మళ్లిస్తున్నా మని చెప్పారు. వాహనదారులు గమనించాలని కోరారు.










