ప్రమాదపు అంచున డ్రాగన్ ప్రమాదపు అంచున డ్రాగన్ ట్రైయిన్..
పట్టించుకోని
అధికారులు
ప్రజాశక్తి-వెంకటగిరి: ప్రతి ఏటా వెంకటగిరి పోలేరమ్మ జాతరకు సంచార వ్యాపారులు పెద్దకళ చూపరులకు ఆకర్షణగా నిలుస్తారు. వచ్చే నెల 4,5తేదీల్లో జరగనున్న పోలేరమ్మజాతరకు ముందుస్తుగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన డ్రాగన్ ట్రైయిన్ ఏర్పాటు చేసిన కౌవల్యనదీ తీరప్రాంతం కావడంతో ప్రమాదపు అంచున ఏర్పాటు చేయడంతో పలువురు అధికారుల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్థలాలను స్థల యజమానులు ఇవ్వకపోవడంతో కౌవల్య నదీ తీరప్రాంతంలో మట్టిని తోలి ఈఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈఏర్పాటు సందర్శకులను ఆందోళన గురి చేస్తుంది. వెంకటగిరిలో గత 15సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈఎగ్జిబిషన్‌లో 90అడుగుల జాయింట్ వీలు, పడవ, సెలంబో, బ్రేక్‌డ్యాన్, డ్రాగెన్ ట్రైయిన్, చిన్న పిల్లల బైకులు, కారులు, నీళ్లలో పడవ, బౌన్సర్ ఏర్పాటు చేశారు. చట్టుపక్కల ఉన్న ప్రజలు ఈఎగ్జిబిషన్‌ను ఆదరిస్తున్నారు. మద్రాసు, గుంటూరు, బెంగుళూరు ప్రాంతాల నుంచి సంచార వ్యాపారాలు పెద్దఎత్తున వెంకటగిరికి ప్రతి ఏటా వస్తుంటారు. రోడ్డు మార్జిన్‌లో వీరు వ్యాపారాలు ఇప్పటి నుండే దసరా, దీపావళి వరకు వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి జాతర సందర్భంగా వెంకటగిరికి వచ్చి వ్యాపారాలు సక్రమంగా జరగకపోయినా రావడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. వారు సంపాందించే డబ్బులు మూడు పూట్ల భోజనానికి, రవాణా ఖర్చులకే సరిపోతుంది. గతంలో మున్సిపాలిటి వారు వీరి వద్ద నుంచి రోడ్డు మార్జిన్ కింద పన్నులు వసూలు చేసే వారు. చిరు సంచార వ్యాపారులు రోడ్డుకు ఇరువైపుల పెట్టుకోవడంతో జాతరకు వచ్చిన భక్తులకు ఈవ్యాపారులు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నారు. వెంకటగిరిలో గత 10సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈఎగ్జిబిషన్‌లో 90అడుగుల జాయింట్ వీలు, పడవ, సెలంబో, బ్రేక్‌డ్యాన్, డ్రాగెన్ ట్రైయిన్, చిన్న పిల్లల బైకులు, కారులు, నీళ్లలో పడవ, బౌన్సర్ ఏర్పాటు చేశారు. చట్టుపక్కల ఉన్న ప్రజలు ఈఎగ్జిబిషన్‌ను ఆదరిస్తున్నారు. ఈజాతర వెంకటగిరికి ప్రాంతానికి తలమానికంగా ప్రతి ఏటా జరుగుతుండడంతో ప్రత్యేక ఆకర్షణంగా ప్రాంతంగా నిలుస్తోంది. ఇకనైనా అధికారులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలించి చిన్నారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.










