Jun 06,2023 00:12

బాధితుడిని ఆసుపత్రిలో కలిసిన స్నేహితులు

ప్రజాశక్తి - కె.కోటపాడు
ప్రమాదంలో గాయపడిన యువకునికి తోటి స్నేహితులు లక్షా 70 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మండలంలోని కె.సంతపాలెం గ్రామానికి చెందిన బర్ల దేవుడు నాయుడు వారం రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి తాటి ముంజుల కొరకు వెళ్లాడు. తాటిచెట్టు ఎక్కి తాటి కాయలు కోస్తుండగా దేవుడు నాయుడు ప్రమాదవశాత్తు కిందన పడిపోవడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్నేహితులు విశాఖపట్నంలో ప్రైవేట్‌ హాస్పిటల్లో చేర్పించి దేవుడు నాయుడుకు సర్జరీ చేయించారు. దీనికి రూ.4.50 లక్షల వరకు ఖర్చు అయింది. దేవుడినాయుడు పేదవాడు. దీనికి తోడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ లేరు. ఆయన ఒంటరిగా జీవన సాగిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన యువత తన మిత్రుని ఆదుకోవాలని దృక్పథంతో లక్ష 70 వేల రూపాయలు విరాళంగా సేకరించి సోమవారం అతను చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో చుక్క రమణ, చుక్క నారాయణ మూర్తి, లక్ష్మణరావు, మహేష్‌, అప్పారావు, రావాడ శివప్రసాద్‌ రావు పాల్గొన్నారు