
చిత్రంలో రెయిలింగ్ కూలిన దృశ్యాలు
ప్రజాశక్తి - రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల కేంద్రంలో దళితవాడను కలుపూ కోతుల వాగుపై నిర్మించిన రెండు వంతెనలు కూడా శిథిలావస్థతో ప్రమాదకరంగా మారి పోయాయి. పడమటి గూడెం వద్ద నిర్మించిన వంతెన ఇప్పుటికే శిథిలమై రాకపోకలు నిలిచి పోయా యి. సిఎస్‌ఐ క్రైస్ట్ సమీపంలో కోతుల వాగుపై నిర్మించిన మరొక వంతెన ప్రమాదక రంగా తయారైంది. ఈ వంతెనపై నిరంతరం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ వంతెన రెయిలింగ్ లేకపోవడంతో అగాధం లాంటి లోతైన లోయ ఉండటంతో ఏదైనా జరగరానిది జరిగితే ఏంటని ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు. కనుక అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ వంతెన మరమ్మ తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.