ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని శంకర్ నగర్, పంజరపోలు దగ్గర కల్వర్టు ప్రమాదకరంగా ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యులు నీలకంఠప్ప, పట్టణ కార్యనిర్వాహణ అధ్యక్షులు దిలీప్ ఢోకా ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కల్వర్ట్‌ను నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లేబర్ కాలనీకి వెళ్లే దారికిరువైపులా భద్రత గోడలు నిర్మించకపోవడంతో అటువైపుగా హై స్కూలుకు వెళ్లే విద్యార్థులు రోడ్డు క్రాస్ చేసి వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. రాత్రిలో రోడ్డు సరిగ్గా కనబడకుండా కాలువలో పడిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రమాదాలు జరగకముందే కల్వర్టుకు, రోడ్డుకు ప్రహరీ నిర్మించాలని రోడ్డు భవనాల అధికారులను కోరారు. లేకపోతే రోడ్డు భవనాల కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి మారుతి రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సాయినాథ్, యువజన నాయకులు దేవిశెట్టి వీరేష్, మద్దిలేటి, మాణిక్యరాజు, సుబ్బారెడ్డి, రాము పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నాయకులు










