Aug 29,2023 23:08

సూచనలు చేస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి - ఎచ్చెర్ల: ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లపై రాత్రి, పగటిపూట స్పష్టంగా కనిపించే విధంగా రేడియంతో కలిసి ఉన్న రంగులు వేయాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక సూచించారు. నవభారత్‌ కూడలిలో జాతీయ రహదారి వద్ద మంగళవారం పరిశీలించి ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించారు. అధిక వేగ నియంత్రణ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు ఇసుక డ్రమ్ములను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైవే అధికారుల సమన్వయంతో మలుపులు, ముఖ్య కూడళ్లలో స్పీడ్‌ బ్రేకర్స్‌, ఎల్లో బ్లింకర్స్‌ అవసరమైచోట త్వరితగతిన పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌పి వెంట ఎఎస్‌పిలు టి.పి విఠలేశ్వర్‌, జె.తిప్పేస్వామి, డిఎస్‌పిలు వై.శృతి, ఎస్‌.బాలరాజు, సిఐ ఆదాం, ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులున్నారు.