May 19,2023 19:51

బారికేడ్లను ఏర్పాటు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - మంత్రాలయం
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు గ్రామాల శివారులో బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని కలుదేవకుంట, చిలుకలడోన, చెట్నిహల్లి గ్రామాల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి 167పై అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు వారి సూచనలు పాటించాలని కోరారు.