బ్రేక్ ఇన్‌స్పెక్టర్ విజయరాజు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లు తమకు సహకరించాలని ఏలూరు ట్రాఫిక్ సిఐ దుర్గాప్రసాద్, బ్రేక్ ఇన్‌స్పెక్టర్ విజయరాజు కోరారు. ఏలూరు ఆటో యూనియన్ ప్రథమ మహాసభ స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన దుర్గాప్రసాద్, విజయరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్లు సహకరించాలని కోరారు. ఆటోలను రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా నిలపకూడదని, పరిమితికి మించిన ప్యాసింజర్లను అనుమతించకరాదని సూచించారు. ఆటోలను వేగంగా నడపకూడదన్నారు. జాతీయ రహదారిపై ఆటోలను నడపకూడదని, ఆటో డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.










