Sep 11,2023 23:52

'ప్రకృతి,అడవుల సంరక్షణ అందరి బాధ్యత' పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు

పల్నాడు జిల్లా: ప్రకృతి, అడవులు సంరక్షణ ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అన్నారు. సోమవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి పల్నాడు జిల్లా మండల కేంద్రం కారంపూడి గ్రామానికి చెందిన పర్యావరణ వేత్త కొమెర అంకారావు ( జాజి ) రచించిన 'ప్రకృతి,అడవుల సంరక్షణ అందరి బాధ్యత' పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన దేశంలో ఉన్న 33 శాతం అడవులు వృద్ధి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. కొమెర అంకారావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో అడవులు, నదులు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా సహకరించాలని, అడవి చుట్టూ పక్కన ఉన్న పొలాలలో ఇప్పుడు ప్రకతి వ్యవసాయం ప్రచా రం చేసి, అడవిలోని వణ్య ప్రాణులు ఉనికిని కాపా డాలన్నారు. ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా వాడటం ఆపి వేయడం, చెట్లు నరకకుండా కాపాడటం, ప్రకృతి, వన్య ప్రాణులు సంరక్షణ, హరిత భారతదేశం కోసం ప్రతిఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు.