
ప్రజాశక్తి - ఉండి
ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని పెదపుల్లేరు ఎంపిటిసి సభ్యులు రాయి రాములమ్మ అన్నారు. మండలంలోని పెదపులేరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయాల్లో పండించిన ఆకుకూరలను, కూరగాయలను తక్కువ ధరలకే విక్రయించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి సభ్యులు రాయి రాములమ్మ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి కృత్రిమ రసాయనిక ఎరువులు వాడటం జరగదని వారు సూచించారు. రసాయనాల వాడకం ఎక్కువగా ఉండటంవల్ల ప్రస్తుత పరిస్థితుల్లో అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారన్నారు. ప్రతిఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల సత్యనారాయణ, రాయి శ్రీనివాస్, సిబ్బంది దుర్గ, అంగర శ్రీను పాల్గొన్నారు.
యలమంచిలి : ప్రకృతి సాగుతో పండించిన పంటలు ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని గుంపర్రు గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయ సాగు రైతు జడ్డు బదరీ నారాయణ అన్నారు. మండలంలోని కంబోట్లపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఏ విధమైన పురుగు మందుల అవశేషాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన కాయకూరలు స్టాల్ ద్వారా విక్రయించారు. ఈ సందర్భంగా రైతు బదరీ మాట్లాడుతూ ఈ కాయకూరలు కేవలం జీవామృతం, కసాయములుతో పండించినట్లు చెప్పారు. యూనిట్ ఇన్‌ఛార్జి జ్యోతి మాట్లాడుతూ గ్రామంలో రైతులు డ్వాక్రా మహిళలు తమ తమ పొలంలో గట్ల మీద, ఇంటి పెరటి తోట ఆవరణలో పకృతి వ్యవసాయ పద్ధతిలో కాయకూరలు పండించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది బండి లక్ష్మీదుర్గ, శాంతి పాల్గొన్నారు.