Mar 04,2023 23:32

నమూనా ద్వారా ప్రకృతి వ్యవసాయ గురించి విదేశీయులకు వివరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-సబ్బవరం
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఎపి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజరుకుమార్‌ అన్నారు. మండలంలోని అమృతపురం గ్రామంలో అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లచ్చన్న అధ్వర్యంలో విదేశీయులు శనివారం పర్యటించారు. ఈ బృందంతో టి.విజరుకుమార్‌, సత్య త్రిపాఠి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ కుమార్‌ మాట్లాడుతూ విదేశీ ప్రతినిధులకు, ఎపిసిఎన్‌ఎఫ్‌కు అవసరమైన ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ముడి పదార్థాలు ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, కాషాయాలు, మీనామృతం పంచగవ్య మొదలైన వాటిగురించి వివరించారు. అనంతరం సూర్యమండలం మోడల్‌ గురించి మరియు సారవత్రిక సూత్రాలు గురించి వివరించారు. పిఎండిఎస్‌ వలన కలిగే ప్రయోనజనాలు గురించి తెలియజేశారు. అనంతరం వరి పంటలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు లగుడు చిన్నమ్ముడుతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం వలన కలిగే లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. విదేశీ ప్రతినిధులకు మహిళా సంఘాలతో ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా ముందుకు తీసుకోని వెళ్తున్నారో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సి కృష్ణారావు, ఆర్టిఓ హేమ సుందర్‌, గ్రామ సర్పంచ్‌ బైలపూడి గౌరీ రామారావు, గ్రామ సెక్రటరీ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా సంఘం ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.