
ప్రజాశక్తి - యద్దనపూడి
మండలంలోని జాగర్లమూడిలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు సోమవారం జాగర్లమూడి యూనిట్ ఇంచార్జ్ ఎల్ 2 ఎ కోటి బాబు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన పురుగు మందులకు పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. డేగర్ల శ్రీనివాసరావు పెరటి తోటకి ద్రవ జీవామృతం తయారు చేశారు. ఈ ద్రవజీవ అమృతం వలన భూమిలోని మొక్కలకి కావలసిన సూక్ష్మజీవులు అభివృద్ధి చెందాయని తెలిపారు. మొక్క ఎదుగుదలకి బాగా తోడ్పడుతుందని తెలిపారు.