ర్యాలీ చేపడుతున్న సిబ్బంది
ప్రజాశక్తి-యస్.రాయవరం:మండలంలోని గోకులపాడు గ్రామంలో ఆదివారం రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహనా కల్పించారు.ఈ సందర్బంగా మాస్టర్ ట్రెయినర్ (ఎంటి) రామగోవింద్ మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడితో లాభాలను పొందవచ్చని తెలిపారు. అనంతరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రి సత్యనారాయణ, ఎల్.నాగ గోవిందు, ఎల్.రాము (ఐసిఆర్‌పి ) వి.కనకరావు, ఏ.కాసులు, డి.నందిని, ఎస్.లావణ్య, ఏ.అనురాధ, రైతులు పాల్గొన్నారు.










