Apr 15,2023 23:53

సమావేశంలో మాట్లాడుతున్న డిఆర్‌డిఎ పథక సంచలకులు శోభారాణి

     ప్రజాశక్తి -ఆనందపురం: ప్రకృతి వ్యవసాయంపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని డిఆర్‌డిఎ పథక సంచాలకులు శోభారాణి సూచించారు. ఆనందపురం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం బిఎన్‌ఎఫ్‌ సిబ్బంది కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శోభారాణి పలు విషయాలపై మాట్లాడారు. 2023-24 సంవత్సర కార్యాచరణలో సిబ్బంది ప్రతి ఇంటికీ ఇంటికి వెళ్లి సంవత్సర కాలంలో ఏ విధంగా వ్యవసాయాన్ని సాగుచేస్తున్నారనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయుటకు అవసరమైతే మహిళా రైతులకు సిఐఎఫ్‌ నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. డిపిఎం మోహనరావు మాట్లాడుతూ, రసాయన ఎరువులను విరివిరిగా వాడటం వల్ల ప్రజలకు కేన్సర్‌ వంటి ప్రాణాంతకర వ్యాధులు వస్తున్నాయని, సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వైదేహి, అసిస్టెంట్‌ కో-ఆర్డినేటర్‌ సత్యనారాయణ, మండల ఎపిఎంలు, సీసీలు జేడీఎం ప్రభావతి కల్యాణి పాల్గొన్నారు.