Sep 02,2023 00:09

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
ప్రక్రుతి వ్యవసాయ పద్దతిలో సాగు చేస్తున్న పంటలను గుజరాత్ నుండి వచ్చిన అధికారుల బృందం మండలంలోని కోలలపూడిలో శుక్రవారం పరిశీలించారు. స్థానిక రైతు బోలగాని వెంకటస్వామి పొలంలో పంటలు బలంగా ఉండేందుకు దోహదపడే ద్రవ జీవామృతం, పురుగుల నివారణకు దోహదపడే నియమాస్త్రంని ఉపయోగించి పండించిన పంటలను స్థానిక, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుజరాత్ అధికారులు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ ఆదేశాల మేరకు ఏపీలో ప్రకృతి వ్యవసాయ పద్దతులతో రైతులు పండిస్తున్న పంటలను అధ్యయనం చేయడానికి వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారి వాణిశ్రీ, కోఆర్డినటర్ వెంకట్రావు, పిడిఎం ఎస్ బ్రహ్మయ్య, ఏటిఎం వాసు బాబు, ఏపిఎం రాజారత్నం, సర్పంచ్ మోరపాకుల సతీష్ కుమార్, రహమాన్‌ పాల్గొన్నారు.