
అవగాహన కల్పిస్తున్న నిర్మల
ప్రజాశక్తి-రావికమతం: ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపించాలని ప్రకృతి వ్యవసాయ మండల ఇంచార్జ్ ఎర్రం శెట్టి నిర్మల సూచించారు. మండల కేంద్రంలో పలు పాకల వద్ద ప్రకృతి వ్యవసాయ సాగుకు సంబంధించి మీనామృతం తయారు చేసే విధానాన్ని రైతులతో చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుండలో నాలుగు కేజీలు చేపల వ్యర్ధాలు, నాలుగు కేజీల బెల్లం, 1.1 పొరలుగా వేసుకొని 25 రోజులు లేదా 27 రోజులు ఉంచాలన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపి, 27 రోజులుతర్వాత వడపోసి వాడుకోవాలన్నారు. ఆవు మాత్రం కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఆరు నెలలు నిల్వ ఉంటుందన్నారు.రెండు లీటర్లు మీనామృతం 200 లీ. నీళ్లు కలిపి పిచికారి చేసుకొని వాడుకోవాలన్నారు.