ప్రజాశక్తి - భట్టిప్రోలు
ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్దతిలో వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఐసిఆర్‌పిఎస్, ఎన్ఎఫ్ఏ బివి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కోనేటిపురంలో శనివారం మినీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంతో అనేక వ్యాధులు వస్తున్నాయని అన్నారు. ఆకులు, కాయలతో కషాయం తయారు చేసుకుని పంటలు పండిస్తే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో ఐలవరం, కోనేటిపురం క్లస్టర్ల ఐసిఆర్పీలు డి ఝాన్సీ రాణి, గుర్రం పాండురంగారావు పాల్గొన్నారు.










