Feb 17,2023 00:02

అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి -రావికమతం:కవగుంట, కేబీపీ అగ్రహారం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం, నవధాన్యాలు సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. మండలంలో కవగుంట గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సర్పంచ్‌ దాసరి సూర్యకుమారి వరహాలు మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం సాగుపై రైతులకు తగు శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. రసాయనిక ఎరువులతో పండించిన పంటలను తినడంతో పలు అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. కనీసం ప్రతి రైతు 50 సెంట్లలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంటి రామలక్ష్మి, కెబిపి అగ్రహారం సర్పంచ్‌ ప్రసాదు, ఆర్‌బికే ఇంచార్జ్‌ శరత్‌, ఎస్‌డిఏ గంగరాజు, వివోఏలు పాల్గొన్నారు.
యస్‌.రాయవరం:మండలంలోని గుడివాడలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులకు, మహిళ సంఘాల సభ్యులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంటి రామ గోవిందు, సర్పంచ్‌ దూళి శ్రీనుబాబు, మాజీ సర్పంచ్‌ ఎన్‌ వెంకటపతిరాజు, వాలంటీర్స్‌ పాల్గొన్నారు.