ప్రజాశక్తి - వేటపాలెం చిన్నగంజాం
రసాయన రహిత వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ పి భారతి అన్నారు. చిన్నగంజాం మండలంలోని చీరాల బైపాస్ రోడ్డు మధ్యలో ఉన్న పొలాలలో ప్రకృతి వ్యవసాయం ఎనీ టైం మనీ క్రింద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 365రోజులు ఆరోగ్యం, ఆదాయం సమకూరుతాయని అన్నారు. 20 సెంట్లు ప్రకృతి వ్యవసాయం ప్లానింగ్ చేసుకోవాలన్నారు. ఈ పద్ధతిలో ఆకుకూరలు, దుంప, తీగ జాతి కూరగాయలు, మొక్కజొన్న పంటలను సేంద్రియ ఎరువులతో పండించే పద్దతిని వివరించారు. ప్రకృతి వ్యవసాయం వలన అనారోగ్య భారిన పడకుండా ఆరోగ్యంతో పాటు ఆదాయము ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ, సుగుణ, అవ్వమ్మ పాల్గొన్నారు.










