Sep 20,2023 23:53

ప్రజాశక్తి - భట్టిప్రోలు
పంట పొలాలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని డిఎల్ ఎం మోహనరావు సూచించారు. రసాయన ఎరువులు భూమిని కలుషితం చేస్తుందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు బదులు ప్రకృతిలో లభించే ఆకులు, కాయలతో కషాయం తయారు చేసుకుని పిచ్చికారి చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఐలవరం, కోనేటిపురం గ్రామాలలో వరి పొలాలలో పరిశీలించారు. ఆకు ముడత, నాము తెగులు ఉన్నట్లుగా గుర్తించారు. దీని నివారణకు పేడ, మూత్రం, ఇంగువ, ద్రావణం దశపరచిన కషాయంలో పిచికారీ చేయాలని అన్నారు. ఆయా గ్రామాల యూనిట్లలో ఉన్న క్యాడర్ ఏటీఎం గ్రేస్ మోడల్‌పై అవగాహన కల్పించారు. క్యాడర్ కంపాక్ట్ బాక్స్ లో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంటి బాల, పాప, ఝాన్సీ, రాణి, సురేష్, సిఅర్ పి పాండురంగారావు ఉన్నారు.