Aug 22,2023 22:52

ప్రజాశక్తి - జీలుగుమిల్లి
        ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభదాయకమని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్‌ జిల్లా మేనేజర్‌ బి.తాతారావు పేర్కొన్నారు. మండల సమాఖ్యలో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం జరిగిన శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలో క్రిమిసంహారక మందులు వాడకుండా ప్రకృతిసిద్ధమైన ఎరువులను వాడటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ పంటల వల్ల కొన్నిరకాల జబ్బులను దరికి రాకుండా చూసుకోవచ్చని రైతులకు సూచించారు. అందుకు రైతులందరూ సహజ సిద్ధమైన పద్దతులతో పంటలను పండించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిడి నాగేశ్వరరావు, ఎపిఎం ఎ.రామారావు, అడిషనల్‌ డిపిఎం మహబూబ్‌ వలి, ఎఎంసి డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌, మండల ఐకెపి సిబ్బంది, విఒఎలు పాల్గొన్నారు.