ప్రజాశక్తి-ఆదోనిరూరల్
రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశపు భవనంలో ఎస్సీ రైతులకు నవధాన్యాల కిట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల విలువ చేసే 16 రకాల విత్తనాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా అందజేస్తోందని తెలిపారు. జిల్లాలో 1,648 మంది రైతులకు, ఆదోని నియోజకవర్గంలో పెద్దహరివాణం, బైచిగేరి గ్రామాల్లో 820 మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కాకుండా ప్రతి రైతుకూ కిట్లు అందేలా చూడాలని కోరారు. ఉచితంగా కాకపోయినా సబ్సిడీ కింద ఇచ్చినా రైతులు తీసుకుని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించాలని సూచించారు. 82 మంది రైతులు సాగు విధానం తర్వాత ఎలాంటి దిగుబడి వచ్చిందనే అంశాలను మళ్లీ వివరించాలని, ఎవరూ సాగు చేయకపోయినా ఆ బాధ్యత అధికారులపై ఉంటుందని హెచ్చరించారు. డిపిఎం చంద్రశేఖర్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాసులు, ఎమ్‌టి రేవన్న, మార్కెట్ యార్డు ఛైర్మన్ మజీర అహ్మద్, వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, ఎడిఎ గిరీష్, ఎఒ అశోక్ కుమార్, ఎంసిఆర్‌పి రంగస్వామి, సర్పంచి రామన్న, వైసిపి సీనియర్ నాయకులు పంపాపతి, మెడికల్ నాగరాజ్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు నవధాన్యాల కిట్టు అందిస్తున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి










