ప్రజాశక్తి - మంత్రాలయం
రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కోరారు. శనివారం రాఘవేంద్ర నగర్‌లోని ఆర్‌బికెలో వైసిపి నాయకులు, ఎమ్మిగనూర్ ఆర్‌టిసి డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు వై.సీతారామిరెడ్డితో కలిసి షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రకృతి వ్యవసాయదారులకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల విలువ చేసే 16 రకాల విత్తనాలను ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 53 మంది రైతులకు విత్తనాలు మంజూరయినట్లు చెప్పారు. సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణు గోపాల్ రాజ్, వైసిపి మండల అధ్యక్షులు జి.భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఎంపిటిసి వెంకటేష్ శెట్టి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కుమార్, అగ్రికల్చర్ అసోసియేషన్ నాయకులు అబ్దుల్, ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ అలీ బాష, ఎఇఒ నరసింహ, నాయకులు జనార్ధన్ రెడ్డి, శివకుమార్, వీరారెడ్డి, జగదీష్ స్వామి, అమిన్ బాష, రామకృష్ణ, బాలరాజు, అబ్రహాం, భీమా పాల్గొన్నారు.
విత్తనాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










