
ప్రజాశక్తి-సాలూరు రూరల్ : ప్రకతి వ్యవసాయం, రసాయన వ్యవసాయం మధ్య తేడాను ప్రతి రైతు తెలుసుకోవాలని, ప్రకృతి వ్యవసాయం రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ ప్రకాష్ అన్నారు. పురాతన కాలం నుండి వస్తున్న ప్రకతి వ్యవసాయం వలన కలిగే ప్రయోజనం రసాయన పద్దతులలో సాగు చేస్తున్న వ్యవసాయం వలన కలిగే లాభ నష్టాలపై తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. మామిడిపల్లిలో గత ఏడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తాడుతూరి ఈశ్వర రావు కు చెందిన వరి పంటలో రైతు సాగు చేస్తున్న పద్ధతులను పరిశీలించారు. వరి పంటలో క్రాప్ కటింగ్ పద్దతిని రైతు వివరించారు. ప్రధాన పంటకు అయిన ఖర్చులను పొలం గట్లపై తీగజాతి పంటలను వేయటం ద్వారా వచ్చే ఆదాయంతో చేరుకోవచ్చునని తెలిపారు. తమ చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా ఈ విధానం ద్వారా వ్యవసాయం చేయమని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాష్ కిచెన్ గార్డెన్, ఎటిఎం మోడల్ విధానం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు