ప్లాస్టిక్ వనంలో అందాలను
ఏ వేళకైనా ఏ కాలంలోనైనా
రంగులతో ముఖాలను కడుక్కుని
స్ప్రేలతో తాజాదానం కొనుక్కుని
బతుకులో అనుభవించే
కృత్రిమం ముందు
రెండే రెండు ఆకుల
పచ్చదనం
కావాలంటే
నాలుగు ముళ్ల మొక్కలను
వాటేసుకోవాలి
కొన్నిసార్లు నీళ్లకు బదులుగా
కన్నీరు పెడితేనే
పచ్చదనం పలికేది
ప్రకృతికి సహజత్వం
ఎంత కష్టమో మరి?
కష్టాన్ని ద్వేషించి
సుఖాన్ని ప్రేమించే
మనిషే ప్రకృతికి శాపం.
చందలూరి నారాయణరావు
97044 37247