ప్రజాశక్తి - ఆస్పరి
విద్యార్థులు ప్రకృతి అందాలపై అవగాహన పెంచుకోవాలని గ్రంథాలయ అధికారి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 'ప్రకృతి అందాలు' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సంగీతం, నాట్యం, క్రీడలపై ప్రావీణ్యం పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 20న బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జైపాల్, విజేత హైస్కూల్, నోబుల్, నారాయణ ప్రైమ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.