Aug 15,2023 20:35

మాట్లాడుతున్న కంచర్ల రామయ్య

ప్రజాశక్తి -కందుకూరు :ప్రకాశం ఇంజినీరింగ్‌ విద్యార్థులు దాదాపు అన్ని దేశాల్లో ఏదో ఒక స్థాయిలో 'ప్రకాశం' కుటుంబానికి స్వాగతం పలికే స్థితిలో ఉన్నారని కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సందర్భంగా ఆయన అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు. ఎన్‌సిసి విద్యార్థుల పరేడ్‌ తో పాటు వారి విజయాలను చూస్తే ఆర్మీలో పలు విభాగాల్లో ప్రకాశం భాగస్వామ్యం దక్కించుకుంటుందన్న ధీమా వ్యక్తం అవుతుందని హర్షద్వానాల మధ్య వెల్లడించారు. పూర్వ విద్యార్థులు ఇద్దరూ ఇప్పటికే జూనియర్‌ క్లాస్‌ ఆఫీసర్లుగా ఎంపికయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం 3-4 ఏళ్లలో ఉన్న 50 మంది క్యాడెట్లలో కనీసం 20 మంది ఆర్మీ,నేవి, ఎయిర్‌ ఫోర్స్‌లలో ఆఫీసర్లుగా ఎంపికయ్యేందుకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు.
ప్లేస్‌ మెంట్స్‌ కి ప్రత్యేక శిక్షణ : కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగ నియామకాల సంక్షోభం నెలకొన్న దుస్థితిలో నిపుణత ఉన్నచోట ఎంఎన్‌సిలు ప్రాధాన్యత ఇస్తాయన్న విశ్వాసంతో ఉన్నత శిక్షణా కేంద్రాల నిపుణులతో తమ విద్యార్థులకు దీర్ఘకాలిక శిక్షణ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సిహెచ్‌ రవికుమార్‌ మాట్లాడారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ వి.హరిబాబు, పి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.