Sep 02,2023 20:42

కంచర్ల రామయ్యతో విద్యార్థులు

ప్రజాశక్తి-కందుకూరు : పిసిబి డిజైన్‌ మూడు రోజుల వర్క్‌ షాప్‌ ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు ఆవిష్కరించిన పిసిబి ప్రాజెక్టులను కళాశాల కరస్పాండెంట్‌ రామయ్య శనివారం సందర్శించారు.విశిష్ట సంస్ధ డైరక్టర్‌ సాందీప్‌ మాట్లాడుతూ ఎన్నో కళాశాలలో వర్క్‌ షాప్‌ నిర్వహించిన అనుభవం ఉన్న తనకు, ప్రకాశం విద్యార్థులు వర్క్‌ షాపు లో చూపిన క్రమశిక్షణ, పట్టుదల, ఉత్సాహం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రస్తుత వర్క్‌ షాప్‌ లో నేర్చుకున్న అనుభవాన్ని మోడల్‌ గా తీసుకొని ఇంటర్‌ నెట్లో పరిశోధించి నూతన ప్రాజెక్ట్‌ లను రూపొందించేందుకు కషి చేయాలని ఆయన ఉద్బోధించారు. ఇందులో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ఏ సమయంలోనైనా ఫోన్‌ చెస్తే ఆన్‌ లైన్‌ ద్వారా తగిన సహకారాన్ని అందిస్తామన్నారు.కాలేజీలో పిసిబి తయారీ పరిశ్రమ విశిష్ట సంస్థ , కాలేజ్‌ ప్రొఫెసర్స్‌ సహకారంతో కళాశాలలో పిసిబి ల్యాబ్‌ ను స్థాపించి పిసిబి తయారీ పరిశ్రమగా రూపొందించి విద్యార్ధులకు ట్రైనింగ్‌ తో పార్ట్‌ టైం జాబ్‌ సౌకర్యం కలిపిస్తామని రామయ్య తెలిపారు.ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ విద్యార్థులు రూపొందించిన రైన్‌ అలారం, ఫైర్‌ అలారం, వాటర్‌ ట్యాంక్‌ లెవెల్‌ ఇండికేటర్‌ మరియు ఆటోమేటిక్‌ స్ట్రీట్‌ లైట్‌ ఆన్‌ ఆఫ్‌ పరికరాలను తక్కువ కనెక్షన్స్తో పిసిబి బోర్డ్‌ మీద ఆవిష్కరించి వాటి పనితీరును ప్రదర్శించి ప్రశంసలను పొందారు.వర్క్‌ షాపు లో ప్రతిభ కనబరిచిన ఎలక్ట్రిక్‌ డిపార్ట్మెంట్‌ విద్యార్ధులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ ను విశిష్ట సంస్ధ డైరెక్టర్‌ సాందీప్‌, రామయ్య అందించారు. అనంతరం విద్యార్దులు సాందీప్‌ ను శాలువాతో సత్కరించి మోమెంటోను అందచేశారు. విశిష్ట సంస్థ ట్రైనర్స్‌ జి.యల్‌.వి శాస్త్రి, యన్‌. అనంత్‌, జి. విష్ణు, కాలేజ్‌ ఎలక్ట్రికల్‌ డిపార్ట్మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అల్లా బగాష్‌, శ్రీదేవి, ఏడుకొండలు, రూప , షరీఫ్‌ పాల్గోన్నారు.