
ప్రజాశక్తి-కందుకూరు :యాజమాన్య ప్రతిష్టకు నెలవై, వేలాదిమంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆలంబనమైన ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ వసుదైక కుటుంబ వ్యవస్థగా అలరారుతోందని కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ కే.విజరు శ్రీనివాస్ పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి ప్రకాశం కుటుంబం కళాశాల హాస్టల్లో వేలాదిమంది విద్యార్థుల మధ్య యాజమాన్యం ఘనంగా వేడుక నిర్వహించింది. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి తెప్పించిన వివిధ రకాల కాకర్స్ ను విద్యార్థులకు పంపిణీ చేశారు. కరెస్పాండెంట్ రామయ్య ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, విద్యార్థుల కేరింతల మధ్య దీపావళి సంబరాన్ని అంబరాన్నంటేలా నిర్వహించారు. నూతనంగా ఏడాది మార్కెట్‌కు విడుదలైన అత్యంత ఖరీదైన షాట్స్ విద్యార్థులను కనువిందు చేసిందనికాలేజీ డైరెక్టర్, ఎంఎల్‌సి కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కళాశాలలో పనిచేసే సిబ్బందికి ఒక్కొక్కరి కుటుంబానికి 100శాతం ప్రీమియం యాజమాన్యం చెల్లిస్తూ ఏడాదికి 2 లక్షల ఆరోగ్య బీమా వసుదైక కుటుంబాన్ని తలపిస్తోందన్నారు. సిబ్బందిపై భారం పడకుండా పోస్ట్ ఆఫీస్‌లో అమ్మాయిలకు కలిపిస్తున్న సుకన్య పథకాన్ని అందజేయడం గర్వకారణంగా ఉందని శ్రీకాంత్ అభివర్ణించారు. గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పిన ప్రకాశం విద్యార్థుల సంక్షేమ దష్ట్యా 100శాతం ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేస్తుందని టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ విజరు వెల్లడించారు. కాలేజీ ఎఒ వరపర్ల హరిబాబు, దాసరి కొండలరావు, మునియ్య, వార్డెన్లు, రజిని, సురేష్, అశ్విని, నరసమ్మ సంబరాల కార్యక్రమంలో జాగ్రత్తలు పర్యవేక్షించారని రామయ్య వివరించారు.