Sep 30,2023 00:26

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ప్రజ్వలించే నిప్పు కణిక భగత్‌సింగ్‌ అని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ప్రొపెసర్‌ పి.రాజశేఖర్‌ అన్నారు. భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా వర్సిటీలోని విగ్రహానికి వీసీ శుక్రవారం పూలమాలలేసి నివాలులర్పించారు. స్వాతంత్య్రోద్యమంలో భగత్‌సింగ్‌ పాత్రను గుర్తు చేశారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తిని విద్యార్థులు అవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెక్టార్‌ పి.వరప్రసాద్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, విశ్వ విద్యాలయ అధ్యాపక సంఘం అధ్యక్షులు బి.నాగరాజు, ప్రిన్సిపాళ్లు సిహెచ్‌ స్వరూపరాణి, పి.సిద్దయ్య, జాన్సన్‌, ఇ.శ్రీనివా సరెడ్డి, కె.సునీత, ఇంజినీర్‌ కుమార్‌రాజా పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : భగత్‌సింగ్‌ త్యాగనిరతి నేటి యువతకు ఆదర్శమని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు చెప్పారు. భగత్‌సింగ్‌ 116వ జయంతి సందర్భంగా ప్రకాష్‌నగర్‌లో సభ నిర్వహించారు. ముందుగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అతి పిన్న వయసులో దేశం కోసం చిరునవ్వుతో ఉరికంభం ఎక్కిన భగత్‌సింగ్‌ త్యాగం నిరుపమానమైనదని కొనియాడారు. ప్రస్తుతం దేశం విష పరిస్థితుల్లో ఉన్న నేటి తరుణంలో భగత్‌సింగ్‌ లాంటి యువకులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వి.దుర్గారావు, స్టాలిన్‌ పాల్గొన్నారు.