Mar 24,2023 22:30

ప్రజాశక్తి కంచికచర్ల: ప్రాథమిక విద్య దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్లాలని, అందుకనుగుణంగా విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ అన్నారు. ప్రజ్ఞా వికాసం పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్లో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజ్ఞా వికాసం పరీక్షలో విజేతగా నిలిచిన విద్యార్థులు రానున్న రోజుల్లో చదువులో ముందుకు వెళ్లాలని కోరారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా మనోధైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు, కంచికచర్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు ప్రసాద్‌, జి.గోపినాయక్‌, ఎస్‌.కె.బాషా, ఎస్‌.కె జాహిద, యూటీఎఫ్‌ నాయకులు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.