Mar 26,2023 01:13
ప్రశంసా పత్రం అందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈయేడాది ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి ప్రజ్ఞ వికాసం మోడల్‌ పరీక్షలో విజేతలకు పాఠశాల స్థాయిలో మొదటి రెండు బహుమతులను విజేతలకు అందజేశామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య తెలిపారు. శనివారం బాపట్ల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు చదువుల కోసం పోరాడుతూనే అధ్యయనం పోరాటం నినాదంతో విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహిస్తూ వారిలోని సృజనాత్మకను వెలికి తీయడం కోసం ఇటువంటి మోడల్‌ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్‌ 3 నుంచి జరగబోయే బోర్డు పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని తద్వారా ఉన్నత అభ్యసించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం కలగకుండా కృషి చేయడానికి ఎస్‌ఎఫ్‌ఐ ముందుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లోనే ప్రశంశా పత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.